భారతదేశం, మే 14 -- తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలతో కళకళలాడిన వీధులు ఇప్పుడు కాస్త నిశ్శబ్దంగా మారాయి. వరుసగా శుభముహూర్తాలు ఉండటంతో సందడిగా సాగిన వేడుకలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ గురువారం (మే 14) నుంచి వచ్చే 36 రోజుల పాటు ఎలాంటి ప్రధాన శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడమే దీనికి కారణం.

జ్యోతిష్య శాస్త్రం, వేద పండితుల లెక్కల ప్రకారం మే 14 నుంచి జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం నడుస్తుంది. సాధారణంగా అధిక మాసాలను లేదా 'మూఢమి' పట్టిన కాలాన్ని శుభకార్యాలకు నిషిద్ధంగా భావిస్తారు. ఈ సమయంలో గురు, శుక్ర గ్రహాల ప్రభావం తక్కువగా ఉండటం వల్ల పెద్దలు పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి కీలక నిర్ణయాలను వాయిదా వేస్తుంటారు.

ఈ 36 రోజుల పాటు ప్రధానంగా వివాహాలు, నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు...