భారతదేశం, అక్టోబర్ 30 -- కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ) 3 శాతం పెంచడంతో పాటు పెన్షనర్లకు చెల్లించే కరువు ఉపశమనాన్ని (డీఆర్) కూడా 3 శాతం పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఇప్పటివరకు 60 శాతంగా ఉన్న డీఆర్ జులై 1, 2026 నుంచి 63 శాతానికి చేరుతుంది.

కాలానుగుణంగా పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక ఊరట కలిగించేందుకు కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. పాత పెన్షన్ విధానం (ఓపీఎస్), ఏకీకృత పెన్షన్ విధానం (యూపీఎస్) పరిధిలోని అర్హులైన ఫ్యామిలీ పెన్షనర్లకు ఈ సవరించిన డీఆర్ వర్తిస్తుంది. కుటుంబ పెన్షన్‌ను బట్టి ఎవరికి ఎంత మేర లబ్ధి చేకూరుతుందో వివరంగా పరిశీలిద్దాం.

కరువు ఉపశమనం (డీఆర్) అనేది ద్రవ్యోల్బణాన్ని...