భారతదేశం, అక్టోబర్ 1 -- టెలికాం పరికరాల తయారీ సంస్థ హెచ్‌ఎఫ్‌సీఎల్ (HFCL) షేర్లు స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డుల దిశగా పయనిస్తున్నాయి. అక్టోబర్ 1 ట్రేడింగ్ సెషన్‌లో ఈ షేరు 5 శాతం లాభపడి రూ.237.95 వద్ద ముగిసింది. దీంతో గడిచిన మూడే మూడు ట్రేడింగ్ సెషన్లలో ఈ స్టాక్ 15 శాతానికి పైగా రాబడిని అందించింది. గడిచిన వారం రోజుల్లో 13 శాతం, మూడు నెలల్లో 12 శాతం చొప్పున పెరిగిన ఈ షేరు.. ఆరు నెలల కాలంలో ఏకంగా 227 శాతం ఎగబాకి మల్టీబ్యాగర్‌‌గా నిలిచింది. ఏడాది కాల పరిమితిలో ఇన్వెస్టర్లకు 223 శాతానికి పైగా లాభాలను అందించడం విశేషం.

కాగా, 2026 ఆగస్టులో ఈ షేరు రూ.257 వద్ద 52 వారాల గరిష్ట స్థాయిని తాకగా, 2026 జనవరిలో రూ.59.83 వద్ద 52 వారాల కనిష్ట స్థాయి నమోదు చేసింది.

"ఎగువ స్థాయిలో హెచ్‌ఎఫ్‌సీఎల్ షేరు ఊపు తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ర్యాలీ ...