భారతదేశం, జూలై 22 -- ఆంధ్రప్రదేశ్‌లో భూ హక్కుల పరిరక్షణ, వివాదాల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. నిషేధిత ఆస్తుల జాబితా (22A) నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ నూతన జీఓని విడుదల చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇప్పటివరకు తమ భూమి ప్రభుత్వానిది కాదని నిరూపించుకోవడానికి సామాన్య పౌరులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై ఈ నిబంధనను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. తన భూమి పట్టా భూమి అని పౌరుడు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. ఏ అధికారి అయినా నిర్లక్ష్యంగా వ్యవహరించి భూ యజమాని హక్కులకు భంగం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా...