భారతదేశం, సెప్టెంబర్ 25 -- 22A నిషేధిత జాబితా నుండి మినహాయింపు పొందిన ఇళ్లు, ప్లాట్లు లేదా ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఇప్పుడు చాలా మంది ఎదురుచూస్తున్నారు. దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే ముందు కొన్ని రకాల పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ఎందుకు అంటే రిజిస్ట్రేషన్ దగ్గరకు వెళ్లిన తర్వాత ఒక్క పత్రం లేకపోయినా..మళ్లీ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

మీ వద్ద ఉన్న లేఅవుట్/బిల్డింగ్ పర్మిషన్, లింక్ డాక్యుమెంట్లను స్థానిక సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం లేదా మీ పరిధిలోని రెవెన్యూ అధికారుల వద్ద సరిచూసుకోండి. మీ ఆస్తి 300 అనుమతి పొందిన కాలనీల జాబితా కిందకు వస్తుందో లేదో ప్రాథమికంగా నిర్ధారించుకోండి.

తెలంగాణ రిజిస్ట్రేషన్ల ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా లాగిన్ అయి, ఆస్తి వివరాలు, సర్వే నంబర్, వైశాల్యం, ప్లాన్ అనుమతి సంఖ్యలను నమోదు చేయండ...