భారతదేశం, సెప్టెంబర్ 24 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న శాసనసభలో ఇచ్చిన హామీ మేరకు సహచర మంత్రులతో చర్చించి 22-ఏ సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

22 ఏ లో ఉన్నప్పటికీ సంబంధిత ప్రభుత్వ సంస్థల నుంచి చట్టబద్ధమైన అనుమతులు పొంది అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్లకు నిర్దేశిత నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పిస్తూ రెవెన్యూ శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలక సంస్థలు, డీటీసీపీ లేదా ఇతర పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల నుంచి చెల్లుబాటు అయ్యే లేఅవుట్, భవన నిర్మాణం లేదా అపార్ట్‌మెంట్ అనుమతులు పొందిన ఆస్తులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని చెప్పారు.

అనుమతి పొందిన అనంతరం జరిగిన ర...