భారతదేశం, నవంబర్ 15 -- న్యూజిలాండ్ గడ్డపై టీమ్ఇండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన చివరి వన్డేలో అర్ష్‌దీప్ సింగ్ నేతృత్వంలోని పేస్ దళం నిప్పులు చెరగడంతో భారత్ 22 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఫలితంగా ఐదు వన్డేల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. హామిల్టన్‌లో జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్‌ను సైతం భారత్ 3-2తో గెలుచుకుంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 209 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఛేదనలో న్యూజిలాండ్ 64/1తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఆ దశలో భారత్ ఓటమి ఖాయమనిపించింది. కానీ భారత పేసర్లు ఒక్కసారిగా విజృంభించడంతో కివీస్ 55 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. చివరకు 48.1 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌట్ అయింది.

స్వదేశంలోని ...