భారతదేశం, మే 29 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్​లో బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ కార్లను (ఈవీ) సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవడంలో 'టాటా మోటార్స్', 'ఎంజీ మోటార్స్' ముందంజలో ఉన్నాయి. ఇటీవలే టాటా సంస్థ సరికొత్త ఫీచర్లతో 2026 టియాగో ఈవీని అప్‌గ్రేడ్ చేయగా.. పట్టణ ప్రాంతాల్లో తిరగడానికి అనువుగా ఉండేలా ఎంజీ సంస్థ తన 'కామెట్ ఈవీ'ని మార్కెట్​లో ఉంచింది. విచిత్రంగా టాటా టియాగో ఈవీ టాప్ వేరియంట్ (క్రియేటివ్), ఎంజీ కామెట్ ఈవీ స్పెషల్ వేరియంట్ (బ్లాక్​స్టార్మ్) రెండూ సరిగ్గా రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ఒకే ధర వద్ద లభిస్తున్నాయి. ఒకే బడ్జెట్ అయినప్పటికీ ఈ రెండు ఈవీల పరిమాణం, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఫీచర్లలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కస్టమర్ల సౌలభ్యం కోసం వీటి మధ్య ఉన్న ప్రధాన తేడాలను ఇక్కడ పోల్చి చూద్దాము..

2026 టాటా టియాగో ఈవీ: ఈ టియాగో ఈవీ ఫేస్​లిఫ్ట...