2 డీఏల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నెలాఖరు నాటికి పీఆర్సీ నివేదిక!
భారతదేశం, సెప్టెంబర్ 23 -- పెండింగ్లో ఉన్న కరువు భత్యం (DA) విడుదల, వేతన సవరణ (PRC) నివేదికపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట లభించింది. రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కీలక భేటీ నిర్వహించారు. ఈ చర్చల అనంతరం ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.
క్యాబినెట్ స్థాయి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగ సంఘాల డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రెండు డీఏల ప్రకటనకు ఆమోదం తెలిపింది. మొదటి డీఏ 3.46 శాతం చొప్పున విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
రెండో డీఏ 2.74 శాతం చొప్పున ఇచ్చేందుకు అంగీకరించింది. ఉద్యోగ సంఘాల నాయకులు మొత్తం మూడు డీఏలను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.