భారతదేశం, జూలై 17 -- తెలంగాణలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో వర్షభావ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. జూన్ 1 నుంచి జూలై 14 వరకు రాష్ట్రంలోని కేవలం ఐదు జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. మరో 27 జిల్లాల్లో వర్షపాత లోటు ఉండగా ఒక జిల్లాలో తీవ్ర వర్షపాత లోటు నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో 18 జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు దారుణంగా పడిపోయాయి. ఆగస్టు నాటికి వర్షపాతం 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉండటంతో ఇవి మరింత పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, వర్షపాత లోటు, పడిపోతున్న భూగర్భ జలాలు, జలాశయాల్లో డెడ్ స్టోరేజీలు, రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 'ఎల్‌నినో కంటింజెన్సీ ప్లాన్ వానాకాలం 2026' (ప్రత్యామ్నాయ ప్రణాళిక)ను విడుదల చేశారు. ఈ ...