భారతదేశం, ఏప్రిల్ 26 -- Meet Indian Hero Who Get 100 Cr Twenty Times: దాదాపు రెండు దశాబ్దాల క్రితం అమీర్ ఖాన్ నటించిన 'గజిని' సినిమాతో భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్ ప్రయాణం మొదలైంది. అప్పట్లో అది ఒక అసాధ్యమైన రికార్డు. కానీ, కాలక్రమేణా టెక్నాలజీ మారి, థియేటర్ల సంఖ్య పెరగడంతో ఇప్పటివరకు సుమారు 150 భారతీయ సినిమాలు ఈ ఘనతను సాధించాయి.

ఖాన్‌ త్రయం, రజనీకాంత్, దళపతి విజయ్, కమల్ హాసన్, ప్రభాస్ వంటి హేమాహేమీలు ఈ జాబితాలో ఉన్నప్పటికీ, మరే హీరోకు సాధ్యం కాని రీతిలో అక్షయ్ కుమార్ 20 సార్లు ఈ మార్కును దాటడం విశేషం.

ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన 'భూత్ బంగ్లా' బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించడంతో అక్షయ్ కుమార్ ఖాతాలో 20వ సెంచరీ చేరింది. దీంతో 18 సినిమాలతో రెండో స్థానంలో ఉన్న సల్మాన్ ఖాన్‌ను అక్షయ్ కుమార్ అధిగమించారు....