భారతదేశం, సెప్టెంబర్ 18 -- Director Ravi Lokireddy On Kalyanam Kamaneeyam Jeevitham Movie: వీవీఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా "కళ్యాణం కమనీయం జీవితం". ఈ సినిమాకు రవి లోకిరెడ్డి దర్శకత్వం వహించారు. పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మించారు.

కళ్యాణం కమనీయం జీవితం చిత్రాన్ని ఈ నెల 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా "కళ్యాణం కమనీయం జీవితం" సినిమా టీమ్ సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

నిర్మాత పైలా ప్రసాద్ రావు మాట్లాడుతూ.. "రీసెంట్‌గా మా కళ్యాణం కమనీయం జీవితం సినిమాని మా ఫ్రెండ్స్‌కి , శ్రేయోభిలాషులకు కొంతమంది మీడియా మిత్రులకు చూపించడం జరిగింది. సినిమాని చూసిన తర్వాత ...