భారతదేశం, ఆగస్టు 31 -- భారత ఆటోమొబైల్ రంగానికి సరికొత్త హంగులు ఇస్తూ ఎంజీ మోటార్ తన మొట్టమొదటి మాస్ మార్కెట్ ప్లగిన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ 'హెక్టార్ టోమాహాక్ పీహెచ్‌ఈవీ'ని ఇటీవలే లాంచ్ చేసింది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధరను రూ.25.70 లక్షలుగా సంస్థ నిర్ణయించింది. దేశంలో ఇంధన ధరలు తీవ్రంగా పెరుగుతున్న తరుణంలో, కేవలం ఎలక్ట్రిక్ కార్లకే పరిమితమైతే ఛార్జింగ్ లేదా రేంజ్ సమస్యలు వస్తాయని ఆందోళన చెందే కస్టమర్లకు ఈ ప్లగ్​-ఇన్ హైబ్రిడ్ సాంకేతికత ఒక ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలవనుంది. పెట్రోల్ ఇంజిన్ సౌకర్యం, ఈవీల పొదుపు రెండూ ఒకే ఎస్‌యూవీలో లభించడం దీని ప్రధాన ఆకర్షణ.

మరి ఈ ఎంజీ హెక్టార్ టోమాహాక్ పీహెచ్​ఈవీలో ఏ వేరియంట్ బెస్ట్? ఇక్కడ చూసేయండి..

ఎంజీ హెక్టార్ టోమాహాక్ 'ఎక్స్‌క్లూజివ్', 'ఎస్సెన్స్' అనే రెండు ప్రధాన వేరియంట్లలో లభిస్తుంది. రెండింటిలోనూ ఒకే...