భారతదేశం, ఆగస్టు 8 -- "ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అదీ 50 శాతం డిస్కౌంట్ ఆఫర్లతో!".. సోషల్ మీడియాలో కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఈ తరహా ఆకర్షణీయమైన పోస్టర్ల వెనుక ఒక పెద్ద సైబర్ మోసం దాగి ఉందనే విషయాన్ని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకంగా అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు విసురుతున్న కొత్త రకం డేటింగ్ ట్రాప్ ఇది.

ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ వేదికలుగా "ఫస్ట్ ఆగస్ట్ స్పెషల్ - 50% ఆఫర్", "రెంట్ బాయ్‌ఫ్రెండ్ - యువర్ పర్సనల్ కంపానియన్" అంటూ రకరకాల డిస్కౌంట్ ప్యాకేజీలతో కూడిన పోస్టర్లను నెట్టింట విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.

ఏఐ (కృత్రిమ మేధ) సాయంతో సృష్టించినవి లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన హ్యాండ్సమ్ కుర్రాళ్ల ఫోటోలను ప్రదర్శిస్తూ పెద్ద ధరల పట్టికనే మీ ము...