'రాష్ట్రాన్ని జంగిల్ రాజ్లా మార్చారు'.... పుంగనూరు దాడి ఘటనపై జగన్ తీవ్ర ఆగ్రహం
భారతదేశం, అక్టోబర్ 16 -- ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూడ్చిపెట్టి 'జంగిల్ రాజ్' పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ లోక్సభ పక్ష నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై శుక్రవారం జరిగిన దాడి ఘటనపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఎంపీ మిథున్రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. పుంగనూరు పర్యటనలో జరిగిన దాడి వివరాలను, అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అడిగి తెలుసుకుని ఎంపీకి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం ఎంతమాత్రం ఇష్టం లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.