భారతదేశం, నవంబర్ 10 -- సరిపడా సమయం లేకపోయినా, శక్తికి మించి అలసిపోయినా ఇతరులు అడిగిన పనికి 'కాదనలేక' సరేనంటున్నారా? ఎదుటివారు ఎక్కడ నిరాశ చెందుతారో అనే భయంతో సొంత అవసరాలను, విశ్రాంతిని పక్కన పెడుతున్నారా? మానసిక శాస్త్రంలో దీనిని 'పీపుల్ ప్లీజింగ్' (ఇతరులను మెప్పించే ధోరణి) అంటారు. నిరంతరం ఇతరుల కోరికలకే ప్రాధాన్యం ఇస్తూ పోతే మానసిక ప్రశాంతత దెబ్బతినడమే కాకుండా తీవ్ర ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. జస్‌లోక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ కన్సల్టెంట్ సైకాలజిస్ట్ రితికా అగర్వాల్ దీని వెనుక ఉన్న మానసిక కారణాలను, దీని నుంచి బయటపడే మార్గాలను వివరించారు.

అలసిపోయినప్పటికీ ఇతరులకు సాయం చేయడం, షెడ్యూల్ నిండిపోయినా అదనపు బాధ్యతలు నెత్తిన వేసుకోవడం, ఇష్టం లేకపోయినా కేవలం ఎదుటివారి కోసం వేడుకలకు హాజరుకావడం.. ఇవన్నీ స్పష్టమైన సరిహద్దులు గీయలేకపోవడాని...