భారతదేశం, జూలై 13 -- రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ పరిధిలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్యల కేసు దర్యాప్తులో మరో పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు రాజ్‌కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడటానికి ఒక రోజు ముందే ఒక సెల్ఫీ వీడియోను రికార్డ్ చేసినట్లు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.

నిందితుడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు... అందులోని డేటాను విశ్లేషించగా ఈ షాకింగ్ వీడియో బయటపడింది. కేసు దర్యాప్తులో అత్యంత కీలకమైన ఈ మొబైల్ వీడియోను పోలీసులు మీడియాకు చూపించారు. ఈ వీడియో ఆధారంగా నిందితుడు పక్కా ప్రణాళికతోనే, తీవ్రమైన కక్షతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్పష్టమవుతోంది.

పోలీసులు విడుదల చేసిన వీడియోలో రాజ్‌కుమార్ తన ఆవేదనను, హత్యకు గల కారణాలను వివరించాడు. ఒక అమ్మాయిని నమ్మి తాను ఎంతలా మోసపోయిందో ఆ వీడియోలో కన్నీరు పెట్టుకున్నాడు.

"నేను చాలా మ...