భారతదేశం, జనవరి 4 -- నదీ జలాల సమస్యలు, పాలనపై అధికార పార్టీ తెలంగాణ ప్రజలను పదే పదే మోసం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైనప్పటికీ, దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ నాయకులను ఉరితీయాలని అన్నారు.

ఆదివారం తెలంగాణ భవన్‌లో 'నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలు' అనే అంశంపై మాజీ నీటిపారుదల మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీలో మర్యాద కుప్పకూలిపోతోందని, సభానాయకుడిగా రేవంత్ రెడ్డి ప్రవర్తన ప్రమాణాలను దిగజార్చిందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఉపయోగించిన భాషను తీవ్రంగా వ్యతిరేకించారు.

తెలంగ...