భారతదేశం, మే 28 -- కర్ణాటక ప్రజలకు డీకే శివకుమార్ సుపరిచితుడు. కనకపుర సమీపంలోని దొడ్డాలహళ్లి గ్రామంలో 1962లో జన్మించిన శివకుమార్, సామాన్య రైతు కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు.

రాజకీయ అరంగేట్రం: 1980లలో విద్యార్థి రాజకీయాల ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1989లో సాతనూరు నుంచి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

సామాజిక నేపథ్యం: కర్ణాటకలో అత్యంత ప్రభావవంతమైన ఒక్కలిగ (Vokkaliga) సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు.

విద్యార్హత: పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడల్లా ఆదుకునే 'క్రైసిస్ మేనేజర్' గా శివకుమార్ గుర్తింపు పొందారు. కేవలం కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా పార్టీకి ఆయన కీలకంగా మారారు.

"భారత జాతీయ కాంగ్రెస్ కూలిపోతున్న కూటమిని కాపాడుకోవాలన్నా, తిరుగుబాటును అణచివేయాలన...