భారతదేశం, సెప్టెంబర్ 3 -- తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై చర్చలు కొనసాగుతుండగా. మరోవైపు కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. చిన్నారెడ్డిపై వేటు వేసిన కాంగ్రెస్ అధినాయకత్వం..తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ ఛైర్మన్ పదవి నుంచి తప్పించింది. కొత్తగా గద్వాల విజయలక్ష్మిని నియమించింది.

కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) కొత్త ఛైర్‌పర్సన్‌గా రాజ్యసభ మాజీ సభ్యురాలు జి. సుధారాణిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు కుడా పరిధిలోని పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన దిశగా ఆమె ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి రెండేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మార్పుల ద...