భారతదేశం, మే 29 -- సోషల్ మీడియా వేదికగా రాజకీయ వ్యంగ్యాస్త్రాలు సంధించే 'కాక్రోచ్ జనతా పార్టీ'కి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. భారత్‌లో నిలిపివేసిన (Withheld) తమ ఎక్స్ ఖాతాను తక్షణమే పునరుద్ధరించాలన్న ఆ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

శుక్రవారం ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు, సదరు ఎక్స్ ఖాతాలోని కంటెంట్‌ను పరిశీలించింది. అందులోని కొన్ని పోస్టులు "కాస్త అభ్యంతరకరంగా" (Slightly offensive) ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో, ఎటువంటి మధ్యంతర ఊరట ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ప్లాట్‌ఫామ్ వాదనలు వినాల్సి ఉందని, అప్పటి వరకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని ధర్మాసనం పేర్కొంది.

"ఈ అంశంపై సమగ్రమైన విచారణ అవసరం. ప్రభుత్వం, ఎక్స్ సంస్థలు తమ ...