భారతదేశం, ఏప్రిల్ 23 -- విడతల వారీగా ఆర్టీసీ బస్సులన్నీ త్వరలోనే ఏసీ ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చుతామని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ఇన్‌గాట్-వేఫర్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. గ్రీన్ ఈవీ వాహనాలను తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామని చంద్రబాబు అన్నారు. ఆర్టీసీ కూడా 1,050 బస్సులను తీసుకువస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు.

'రాబోయే రోజుల్లో క్రమంగా ఆర్టీసీ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తాం. మీరందరూ సహకరించాలి. కేవలం డబ్బు ఉన్నవాళ్లే కాదు. పేదలు కూడా ఏసీలో తిరగాలి. అంతేకాదు ప్రతీ ఇల్లూ సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా కావాలి. అందుకోసం ఏర్పాట్లు చేసుకోవాలి.' అని సీఎం చంద్రబాబు అన్నారు.

విద్యుత్...