భారతదేశం, జూన్ 8 -- న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సోమవారం 'ఇండియా' కూటమి అగ్రనేతలు సమావేశమయ్యారు. మొత్తం 25 ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరైన ఈ భేటీలో జాతీయ రాజకీయాలు, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ తదితర నేతలతో కలిసి మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ భేటీలో ఐదు ప్రధాన అంశాలపై కూటమి ఏకాభిప్రాయానికి వచ్చిందని ఆయన ప్రకటించారు.

ఎన్నికల్లో అక్రమాలు, ఓట్ల తొలగింపు, 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియలో జరుగుతున్న లోపాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌కు సంయుక్తంగా లేఖ రాయాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఈ లేఖను త్వరలోనే సీజేఐకి అందజేయనున్నారు.

నీట్ (NEET), సీబీఎస్ఈ (CBSE) ...