భారతదేశం, జూన్ 17 -- ​Sing Geetham Box Office: సినిమా బాగుంది అని విమర్శకులు మెచ్చినా, సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టడం ఎంత కష్టంగా మారిందో 'సింగ్ గీతం' (Sing Geetham Movie)సినిమాను చూస్తే అర్థమవుతోంది. సక్నిల్క్ ప్రకారం ఈ మూవీ కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కానీ నిర్మాతలు ఇప్పటికే సేఫ్ అయ్యారు. అది ఎలానో చూసేయండి.

టాలీవుడ్ లెజెండరీ విజనరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) రూపొందించిన ఈ వినూత్న ప్రయోగాత్మక సింగ్ గీతం సినిమాను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపడం లేదు. విభిన్నమైన కథాంశంతో వచ్చిన ఈ సినిమా థియేట్రికల్ రన్ పరంగా తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది.

​సింగ్ గీతం విడుదలైన ఐదు రోజుల్లో ఇండియా అంతటా కలిపి కేవలం రూ.3.76 కోట్ల నెట్ వసూళ్లను మాత్...