భారతదేశం, ఏప్రిల్ 9 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ (SUV) సెగ్మెంట్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు హ్యుందాయ్ క్రెటా. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో రారాజుగా వెలుగొందుతున్న క్రెటా, తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు 'సమ్మర్ ఎడిషన్' (Creta Summer Edition) వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధరను రూ. 12.05 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) సంస్థ నిర్ణయించింది.

కేవలం డిజైన్ పరంగానే కాకుండా, ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ స్పెషల్ ఎడిషన్‌లో హ్యుందాయ్ కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా భారతీయ రోడ్లపై పెరుగుతున్న ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనల దృష్ట్యా డ్యాష్‌క్యామ్ (Dashcam) వంటి ఫీచర్లను జోడించడం విశేషం.

ఈ సమ్మర్ ఎడిషన్ వేరియంట్లలో ఫీచర్ల పరంగా భారీ అప్‌గ్రేడ్స్ కనిపిస్తున్నాయి. ఎంపిక చేసిన వేరియంట్లలో డ్య...