భారతదేశం, జూన్ 21 -- KBR Park Traffic Diversions : హైదరాబాద్ నగరంలో కీలకమైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ముఖ్యమైన అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (H-CITI) ప్రాజెక్టులో భాగంగా ఈ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతిష్టాత్మకమైన స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఈ నిర్మాణ పనుల కారణంగా... కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. జూన్ 21, 2026 (ఆదివారం) ఉదయం 10:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకువన్-వే ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన సైన్‌బోర్డుల ఆధారంగా వాహనదారులు ఎడమ, కుడి లేన్‌లలోకి మారడానికి 'లేన్ చేంజర్స్' ఉపయోగించుకోవాలని పోలీసులు...