భారతదేశం, జూన్ 14 -- నీట్ పేపర్ లీకేజీ వివాదం, సీబీఎస్‌ఈ (CBSE) ఆన్-స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్‌లో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) భారీ నిరసనను చేపట్టింది. ఇందులో పలు విద్యార్థి, ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.

ఎన్టీఏకు వ్యతిరేకంగా నిరసన స్వరాన్ని వినిపించేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, యువత, విద్యావేత్తలు భారీ సంఖ్యలో ధర్నా చౌక్‌కు తరలివచ్చారు. "మాకు న్యాయం కావాలి" (We Want Justice), "ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి" అంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్ల...