భారతదేశం, జూన్ 3 -- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ క్యాంపస్ స్కూల్‌లో కాంట్రాక్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ వెలుడింది. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. గచ్చిబౌలిలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ క్యాంపస్ స్కూల్‌లో ఖాళీగా ఉన్న వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పాఠశాల యంత్రాంగం ప్రకటించింది.

ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి పలు సబ్జెక్టులలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఆరు నెలల కాలపరిమితి (జూన్ 22 నుండి డిసెంబర్ 26 వరకు) కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుంది.

క్యాంపస్ స్కూల్‌లో జూన్ 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు సబ్జెక్టుల వారీగా ఇంటర్వ్యూలు జరుగుతాయి. అర్హ...