భారతదేశం, ఫిబ్రవరి 25 -- భాగ్యనగర ఐటీ హబ్ మాదాపూర్‌లోని 'మైండ్‌స్పేస్' క్యాంపస్ మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు వేదిక కానుంది. గ్రేడ్-ఏ ఆఫీస్ అసెట్స్ డెవలపర్ అయిన మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ REIT, తన మాదాపూర్ క్యాంపస్‌లో 5.3 లక్షల చదరపు అడుగుల భవనాన్ని లగ్జరీ హోటల్ ప్రాజెక్ట్ కోసం షాలే హోటల్స్ (chalet hotels) లిమిటెడ్‌కు ప్రీ-లీజుకు ఇచ్చినట్లు బుధవారం ప్రకటించింది.

ఈ నూతన భవనాన్ని సుమారు Rs.350 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. ఇందులో 330 గదులతో కూడిన అత్యాధునిక లగ్జరీ హోటల్‌తో పాటు వాణిజ్య అవసరాల కోసం అదనపు స్థలాన్ని కేటాయిస్తారు. మైండ్‌స్పేస్ REITకి చెందిన స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) అయిన 'కె. రహేజా ఐటీ పార్క్ (హైదరాబాద్) లిమిటెడ్ (KRIT)' ఈ భవనాన్ని నిర్మిస్తుంది. కాగా, హోటల్ లోపలి అలంకరణ (Interior fit-outs), నిర్వహణ బాధ్యతలను ష...