భారతదేశం, జూన్ 15 -- హైదరాబాద్ మహానగరానికి అత్యంత ఆవశ్యకత కలిగిన మెట్రో విస్తరణ చేపట్టడానికి వీలుగా, ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవడానికి అన్ని రకాల ఒప్పందాలు కుదిరినప్పటికీ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిధులు ఎందుకు విడుదల కాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి, సీతక్క, శ్రీహరి, పలువురు ఎంపీలు, ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఎల్ అండ్ టీ నుంచి మెట్రో మొదటి దశ స్వాధీనం, నిధుల సమీకరణ, రెండో దశ విస్తరణ అంశాలపై సవివరంగా తెలిపారు. హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించడానికి మెట్రో రైలు విస్తరణ ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిరభ్యంతర పత్రం (NOC) ఇస్...