భారతదేశం, మార్చి 22 -- ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరుగుతున్న సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్-2026, ట్రాన్స్ఫార్మింగ్ ఏఐ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుకు ఐఎస్‌బీ ప్రతినిధులు, వివిధ పారిశ్రామిక వేత్తలు స్వాగతం పలికారు. సదస్సులో ది ఫ్యూచర్ ఆప్ ఎవ్రీతింగ్ అనే అంశంపై అభిప్రాయాలను వెల్లడించారు చంద్రబాబు.

1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఏపీని పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆర్థిక సంస్కరణల్ని అందిపుచ్చుకున్నామన్నారు. నాలెడ్జి ఎకానమీదే భవిష్యత్తు అని ఆలోచన చేసి టెక్నాలజీని ప్రోత్సహించి ఐటీని అందిపుచ్చుకున్నామన్నారు.

'ఐటీకి సూచికగా సైబర్ టవర్స్ నిర్మాణం చేశాం. ప్రజలకు మేలు జరగాలన్న లక...