భారతదేశం, అక్టోబర్ 8 -- దీపావళి పండుగ వేళ సొంత ఊళ్లకు, పర్యటనలకు వెళ్లే ప్రయాణికులకు విమానయాన సంస్థలు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(RGIA) నుంచి దేశీయ విమాన ఛార్జీలు ఊహించని రీతిలో ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏకంగా విదేశీ ప్రయాణాల కంటే కూడా దేశీయ నగరాలకు వెళ్లే విమాన టికెట్ల ధరలే అధికంగా ఉండటం ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

సాధారణంగా పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీ వల్ల ఛార్జీలు పెరగడం సాధారణమే అయినప్పటికీ, ఈసారి పరిస్థితి మరీ తీవ్రంగా మారింది. హైదరాబాద్ నుంచి సింగపూర్, మలేషియా, థాయిలాండ్‌లోని బ్యాంకాక్ వంటి అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వన్-వే విమాన టికెట్ ధరలు రూ. 15,000 నుండి రూ. 18,000 మధ్య అందుబాటులో ఉన్నాయి.

కానీ హైదరాబాద్ నుంచి ఉత్తరాది, ఈశాన్య నగరాలకు వెళ్లే విమాన...