హైదరాబాద్ నుంచి ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌కు డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు
భారతదేశం, సెప్టెంబర్ 29 -- హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తన అంతర్జాతీయ ప్రయాణ సౌకర్యాలలో మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌కు ప్రముఖ విమానయాన సంస్థ సెంట్రమ్ ఎయిర్ నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. దక్షిణ భారతదేశం నుంచి మధ్య ఆసియా ప్రాంతానికి నేరుగా డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి.
ఈ ప్రారంభోత్సవ వేడుకలను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీహెచ్ఐఏఎల్ ఉన్నతాధికారులు, సెంట్రమ్ ఎయిర్ ప్రతినిధులు, ఇతర భాగస్వాముల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక కార్యక్రమం అనంతరం హైదరాబాద్ నుండి తొలి విమానం తాష్కెంట్‌కు బయలుదేరి వెళ్లింది.
వారానికి రెండు రోజులు సర్వీసులు ఉండనున్నాయి. ఈ కొత్త విమాన సర్వీసు వారానికి రెండు రోజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.