భారతదేశం, జూలై 28 -- హైదరాబాద్‌లో పక్షుల సంరక్షణ, నగర జీవవైవిధ్యంపై అధ్యయనం ముమ్మరంగా సాగుతోంది. తాజాగా ముగిసిన హైదరాబాద్ బర్డ్ అట్లాస్(HBA) నాల్గో విడత సర్వేలో మరొక మూడు కొత్త పక్షి జాతులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఇప్పటివరకు రాజధాని నగరంలో నమోదైన మొత్తం పక్షి జాతుల సంఖ్య 248కి చేరింది.

వరల్డ్ వైడ్‌ఫండ్ ఫర్ నేచర్-ఇండియా, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్, దక్కన్ బర్డర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సిటిజన్ సైన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. జూలై 4న ప్రారంభమై 22 రోజుల పాటు జరిగిన ఈ సర్వేలో 200 మందికి పైగా వాలంటీర్లు పాల్గొన్నారు.

ఈ నాలుగో సీజన్ సర్వేలో గ్రేటర్ ఫ్లెమింగో, ఎల్లో-ఫుటెడ్ గ్రీన్ పిజియన్, బ్రౌన్-క్యాప్డ్ పిగ్మీ వుడ్‌పెక్కర్ అనే మూడు కొత్త జాతులను గుర్తించారు. వాలంటీర్లు మొత్తం 1,250 గంటలకు పైగా శ్రమించారు. ఇది గత మూడో సీజన్‌తో పోలిస్త...