భారతదేశం, జూలై 15 -- రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు హైదరాబాద్ - గోరఖ్‌పూర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగించడంతో పాటు నాందేడ్ - తిరుచానూరు మధ్య కొత్తగా స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక రైళ్ల పూర్తి షెడ్యూల్, సర్వీసుల వివరాలను విడుదల చేసింది.

హైదరాబాద్ - గోరఖ్‌పూర్ - హైదరాబాద్ ప్రత్యేక రైళ్ల పొడిగించింది. హైదరాబాద్, గోరఖ్‌పూర్ మధ్య ప్రయాణించే వారి అదనపు రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంది.

07075 హైదరాబాద్ - గోరఖ్‌పూర్ 07.08.2026, 14.08.2026, 21.08.2026, 28.08.2026 తేదీల్లో నడుస్తుంది. 07076 గోరఖ్‌పూర్ - హైదరాబాద్ 09.08.2026, 16.08.2026, 23.08.2026, 30.08.2026 తేదీల్లో ఉంటుంది...