హైదరాబాద్ గచ్చిబౌలి రూట్లో జూలై 1 నుంచి 90 రోజులు ట్రాఫిక్ మళ్లింపులు
భారతదేశం, జూన్ 29 -- ఐటీ కారిడార్లో ప్రయాణించే వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. గచ్చిబౌలి పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మల్టీ-లెవెల్ ఫ్లైఓవర్, అండర్పాస్ పనుల కారణంగా డీఎల్ఎఫ్ గేట్ నంబర్ 1 నుండి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న రోడ్డును రాబోయే మూడు నెలల పాటు పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నూతన ఆంక్షలు జులై 1 నుండి అమలులోకి రానున్నాయి.
ఈ నిర్మాణ పనులు కనీసం ఏడాది పాటు సాగే అవకాశం ఉన్నందున, ఐఐఐటీ (IIIT) జంక్షన్ పరిసర ప్రాంతాలలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ప్రయాణికులు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
రాడిసన్ హోటల్ వైపు నుంచి వచ్చే వాహనాలను డీఎల్ఎఫ్ గేట్ నంబర్ 1 వరకు మాత్రమే అనుమతిస్తారు. అక్కడి నుంచి ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.