భారతదేశం, అక్టోబర్ 5 -- హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సరఫరాకు సంబంధించి జలమండలి ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు (KDWSP) ఫేజ్-II పరిధిలో అత్యవసర మరమ్మతు పనులు చేపడుతున్నట్లు పేర్కొంది. ఫలితంగా నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో నీటి సరఫరాలో తీవ్ర అంతరాయం కలగనుంది.

నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీస్, వాల్వుల మార్పిడి పనులను చేపట్టనున్నారు. వీటితో పాటు స్కవర్ పైప్‌లైన్‌లో ఏర్పడిన నీటి లీకేజీలను అరికట్టేందుకు ముమ్మరంగా మరమ్మతులు నిర్వహించనున్నారు.

ఈ అత్యవసర మరమ్మతు పనులు ఇవాళ ఉదయం నుంచి మంగళవారం (అక్టోబర్ 6, 2026) సాయంత్రం 6:00 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతాయి. ఈ వ్యవధిలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడం లేదా పాక్షికంగా రావడం జరుగ...