భారతదేశం, జూలై 4 -- హైదరాబాద్‌లోని డిఫెన్స్ మెటలర్జికల్ రిసెర్చ్ లాబొరేటరీ(DMRL) తాజాగా ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO) పరిధిలో పనిచేసే ఈ ప్రతిష్టాత్మక సంస్థ.. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల కోసం సరికొత్త పెయిడ్ ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పిస్తోంది. పరిశోధన రంగంపై ఆసక్తి ఉండి, రక్షణ రంగ సంస్థల్లో అనుభవం సంపాదించాలనుకునే యువతకు ఇది ఒక సువర్ణావకాశం.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఆరు నెలల పాటు శిక్షణతో కూడిన ఇంటర్న్‌షిప్ అందిస్తారు.

మెటలర్జికల్ లేదా మెటీరియల్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(డేటా సైన్స్‌తో కలిపి) వంటి విభాగాలకు చెందిన విద్యార్థులు ఈ పోస్టులకు అర్హులు. గుర్తింపు పొందిన వ...