భారతదేశం, సెప్టెంబర్ 21 -- సూర్యాపేట జిల్లా పరిధిలో ఆదివారం ఉదయం అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి జాతీయ రహదారి డివైడర్‌ను ఢీకొట్టడంతో క్షణాల్లో మంటలు వ్యాపించి ఓ వైద్యుడు కారులోనే తీవ్రంగా దగ్ధమై ప్రాణాలు కోల్పోయారు.

బాధితుడు ఖమ్మం జిల్లా వైరాకు చెందిన న్యూరోసర్జన్ డాక్టర్ జగదీష్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన ప్రస్తుతం ఖమ్మంలోని ప్రముఖ మమత ఆసుపత్రిలో నాడీ వ్యవస్థ శస్త్రచికిత్స నిపుణుడిగా (న్యూరోసర్జన్) సేవలందిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ జగదీష్ హైదరాబాద్ నుంచి తన స్వస్థలమైన ఖమ్మం వైపు కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. ఆదివారం ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో సూర్యాపేట పరిధిలోని 365వ జాతీయ రహదారిపైకి చేరుకోగానే, ఆయన నడుపుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇనుప గ్రిల్స్ (డివైడర్)...