హైదరాబాద్‌లో 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'.. ప్రారంభించిన యూఎస్ రాయబారి, భట్టి
భారతదేశం, జూన్ 23 -- హైదరాబాద్ మరో అంతర్జాతీయ మైలురాయికి వేదికైంది. అమెరికా దేశ 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను (ఫ్రీడమ్ 250) పురస్కరించుకుని నగరంలో ఘనంగా గాలా రిసెప్షన్ నిర్వహించారు. ఈ చారిత్రాత్మక వేడుకలో భాగంగా గచ్చిబౌలిలోని అమెరికన్ కాన్సులేట్ పక్కనే ఉన్న రహదారిని 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అధికారిక ఫలకాన్ని ఆవిష్కరించారు. భారత్‌లో యూఎస్ రాయబారి సెర్గియో గోర్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంయుక్తంగా ఈ ప్లాక్‌ను ఆవిష్కరించి, ఇరు దేశాల బంధాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు.
ఈ వేడుకకు పలువురు సీనియర్ దౌత్యవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వ్యాపార, ఏరోస్పేస్, రక్షణ, సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అమెరికా జాతీయ ఆర్థిక, భద్రతా ప్రాధాన్యతలతో పాటు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.