భారతదేశం, జూన్ 17 -- తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను అంతర్జాతీయ గుర్తింపు ఉన్న నగరంగా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిన వ్యక్తులు, సంస్థల పేర్లను నగరంలోని ప్రధాన రహదారులకు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.

గత ఏడాది డిసెంబర్‌లో ప్రతిపాదించిన 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' పేరు పెట్టే ప్రక్రియ కార్యరూపం దాల్చింది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం సమీపంలో ఉన్న ఒక ప్రధాన రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేస్తూ, జూన్ 23న దీనిని అధికారికంగా ప్రారంభించనున్నారు.

ప్రభుత్వం కేవలం ట్రంప్ పేరు మాత్రమే కాకుండా, దేశ గర్వించదగ్గ వ్యక్తులను, సాంకేతిక దిగ్గజాలను కూడా గౌరవించనుంది.

రతన్ టాటా రోడ్: దివంగత పారిశ్రామిక వేత్త, దే...