భారతదేశం, ఆగస్టు 18 -- Hyderabad Adulterated Ghee Seized : భాగ్యనగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ నెయ్యి తయారీ, విక్రయ ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. స్వచ్ఛమైన దేశీ నెయ్యి పేరుతో మార్కెట్‌లో యథేచ్ఛగా సాగుతున్న భారీ కల్తీ దందాను అధికారులు బహిర్గతం చేశారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా సాగిన ఈ విస్తృత దాడుల్లో ఏకంగా 36 టన్నుల అపరిశుభ్ర, కల్తీ నెయ్యితో పాటు, దాని తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు, ప్రమాదకర రసాయనాలను సీజ్ చేసినట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు.

విశ్వసనీయ సమాచారం, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 'హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్' (H-FAST), ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అధికారులు సంయుక్తంగా ఈ ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించారు. నగరవ్యాప్తంగా ఉన్న 39 నెయ్యి తయారీ యూనిట్లు, 91 విక్రయ కేంద్రాల...