భారతదేశం, ఏప్రిల్ 5 -- హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఒక కలవరపరిచే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడో వ్యక్తి. అందుకోసం మతం మారినట్టుగా నటించాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మెుదటి రాత్రి రోజున భార్యను రేప్ చేయించాడు. ఈ విషయాన్ని బాధితురాలే బయట చెప్పుకున్నది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

నవాజ్ అనే వ్యక్తి దుకాణం అద్దె విషయంలో ఒక మహిళను తరచూ సంప్రదించాడు. ఆమెతో పరిచయం పెంచుకుని.. మెల్ల మెల్లగా.. దగ్గరయ్యాడు. కొన్ని రోజులకు పెళ్లి ప్రతిపాదన చేశాడు. అంతేకాదు తనను అంగీకరించేందుకు హిందూ మతంలోకి మారినట్లు నటించాడని ఆ మహిళ తెలిపింది. తన పేరును నవదుర్గగా మార్చుకుని, 2025 జూన్‌లో తనను వివాహం చేసుకున్నాడని మహిళనే ఈ విషయాలు చెప్పుకొచ్చింది.

పెళ్లయిన మొదటి రోజే.. నిందితుడు మరో నలుగురితో కలిసి తనకు మత్తుమందు ఇచ్చి లైంగికంగా వేధి...