భారతదేశం, ఏప్రిల్ 4 -- ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, భాగ్యనగరంలో తన ఉనికిని మరింత చాటుకుంటూ తెల్లాపూర్‌లో 'ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్' అనే భారీ టౌన్‌షిప్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. 29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 5,120 నివాస గృహాలు అందుబాటులోకి రానున్నాయి.

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్లకు సమీపంలో ఉండటం, మెరుగైన సామాజిక మౌలిక సదుపాయాలు ఉండటం వల్ల తెల్లాపూర్ నివాస ప్రాంతంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆధునిక డిజైన్, విశాలమైన ఖాళీ ప్రదేశాలు, అత్యాధునిక వసతులతో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఈ లాంచ్ సందర్భంగా ప్రెస్టీజ్ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఇర్ఫాన్ రజాక్ మాట్లాడుతూ.. "హైదరాబాద్ మాకు అత్యంత కీలకమైన మార్కెట్. మౌలిక సదుపాయాల వృద్ధి...