భారతదేశం, మార్చి 7 -- హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ నుంచి గ్లోబల్ వీఎఫ్ఎక్స్ హబ్ రానుంది. ముంబైలో ఉన్న కార్యాలయం తర్వాత హైదరాబాద్‌లోని యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగానికి పెద్ద ప్రోత్సాహాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. హైదరాబాద్‌లో మంచి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన ప్రతిభావంతుల లభ్యతతో పాటు మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి ఉన్న క్రేజ్ చూసి నెట్‌ఫ్లిక్స్ ఈ సిటీని ఎంచుకుంది.

నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ వీఎఫ్ఎక్స్ హబ్ 30,000 చదరపు అడుగులతో ఉంటుంది. హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఉనికి, డిజిటల్ కంటెంట్ సృష్టికి ప్రముఖ కేంద్రంగా, AVGC రంగంలో అగ్రగామిగా హైదరాబాద్ ఆవిర్భావాన్ని ఈ కార్యాలయం బలోపేతం చేస్తుంది.

మార్చి 12వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రారంభోత్సవానికి హాజరుకానున్...