హైదరాబాద్లో డ్రైవర్లెస్ పాడ్ టాక్సీలు.. మెట్రో దిగిన వెంటనే సర్వీసులు
భారతదేశం, అక్టోబర్ 11 -- హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలకు స్వస్తి పలుకుతూ.. ప్రయాణ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మెట్రో రైలు దిగిన వెంటనే ప్రయాణికులు కిందకు రాకుండానే నేరుగా స్టేషన్ నుంచే డ్రైవర్ లేని పాడ్ టాక్సీ(Pod Taxi) ఎక్కి తమ ఆఫీసులకు చేరుకునేలా పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS) ప్రాజెక్టును ప్రతిపాదించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(HMRL) అధికారులు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదికను వివరించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం(PPP) పద్ధతిలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వేగవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సుమారు మూడు నెలల పాటు లోతైన అధ్యయనం చేసిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.