భారతదేశం, ఆగస్టు 14 -- హైదరాబాద్ వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగం తిరిగి పాత రికార్డులను తిరగరాస్తోంది. నగరంలో ఆఫీస్ స్థలాలకు డిమాండ్ ఎంత బలంగా ఉందో చాటిచెబుతూ మరో మెగా లీజింగ్ డీల్ పూర్తయింది. ప్రముఖ మేనేజ్డ్ వర్క్‌స్పేస్ సొల్యూషన్స్ సంస్థ 'టేబుల్‌స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్' (Tablespace Technologies Ltd) హైదరాబాద్‌లో దాదాపు 5.06 లక్షల చదరపు అడుగుల వి విస్తీర్ణంలో ఉన్న భారీ ఆఫీస్ స్పేస్‌ను ఐదేళ్ల కాలానికి లీజుకు తీసుకుంది.

రియల్ ఎస్టేట్ సమాచార సంస్థ 'ప్రాప్‌స్టాక్' (Propstack) సేకరించిన పత్రాల ప్రకారం.. ఈ లీజు కాలంలో కంపెనీ మొత్తం రూ.163.3 కోట్లను అద్దె రూపంలో చెల్లించనుంది. జూన్ 27, 2026న రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగా, జూలై 1, 2026 నుంచే ఈ లీజు అమల్లోకి వచ్చింది.

లక్ష్మీ ఇన్ఫోబాన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఎల్‌ఎల్‌పీకి చెందిన ప్రాపర...