భారతదేశం, మే 3 -- హైదరాబాద్‌లోని మీర్‌పేటలో హిట్ అండ్ రన్ ఘటనలో తండ్రీకొడుకులు గాయపడ్డారు. అయితే కారు డ్రైవర్ అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తూ.. బాధితుడిని తన కారు బానెట్‌పైనే రెండు కిలోమీటర్ల దూరం పాటు అత్యంత దారుణంగా ఈడ్చుకెళ్లాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిలానీ అనే వ్యక్తి తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నాడు. కారులో వచ్చిన ఓ వ్యక్తి వీరి బైక్‌ను ఢీకొట్టాడు. మే 1వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కదులుతున్న వాహనాన్ని పట్టుకుని వేలాడుతున్న వ్యక్తిని ఉన్న ఒక వీడియో వైరల్ అయింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

బైక్ నడుపుతున్న జిలానీ కుమారుడు దాదాపు 500 మీటర్ల ముందుగానే యూ-టర్న్ కోసం ఇండికేటర్ వేశాడు. కారు డ్రైవర్ అలా ఎందుకు వేశావని ప్రశ్నించాడు...