భారతదేశం, అక్టోబర్ 21 -- హైదరాబాద్‌ మరో అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి ఆతిథ్యం ఇవ్వబోతోంది. భారత్, దక్షిణ కొరియా దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో హైదరాబాద్‌లోని ప్రసిద్ధ శిల్పకళా వేదికలో కె-హార్మొనీ ఫెస్టా 2026(K-Harmony Festa 2026) అత్యంత వైభవంగా జరగనుంది. కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా(KCCI), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.

కొరియా కల్చర్ డే 2026 వేడుకల్లో భాగంగా వన్ లైట్, టూ సిటీస్(One Light, Two Cities) అనే ప్రత్యేక థీమ్‌తో ఈ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుక సీయోల్, హైదరాబాద్ నగరాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను వేడుకలా జరుపుకోవడానికి ఒక గొప్ప వేదికగా నిలవనుంది.

ఈ ఈవెంట్ శిల్పకళా వేదికలో అక్టోబర్ 25(ఆదివారం)న జరగనుంది. మధ్యాహ...