భారతదేశం, జూలై 7 -- విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టడానికి ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును పరిశీలించేందుకు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షత వహిస్తారు. ఇందులో 12 మంది ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉంటారు. రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముందే తన నివేదికను సమర్పించాలని స్పీకర్ ఈ కమిటీని ఆదేశించారు.

విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టే చర్యలను బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపొందించిన ఈ చట్టాన్ని, తదుపరి చర్యలు చేపట్టే ముందు సవివరమైన పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి పంపారు. ఈ కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు బాలు నాయక్‌, తోట లక్ష్మీకాంతరావు, మధుసూదన్‌రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి, మామిడాల యశస్విని, దానం నా...